ఫీవర్‌ను గుర్తించే ‘స్మార్ట్ రింగ్’!

by Shyam |
ఫీవర్‌ను గుర్తించే ‘స్మార్ట్ రింగ్’!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రధాన లక్షణాల్లో జ్వరం ఒకటి కాగా, ఇప్పుడు కాస్త జ్వరం వచ్చినా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. షాపింగ్ మాల్‌కు వెళ్లినా, సూపర్ మార్కెట్‌‌లో అడుగుపెడదామన్నా, సినిమా హాల్‌లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా, ఆస్పత్రిలో డాక్టర్‌ను మీట్ అవ్వాలన్నా.. ముందుగా ఫీవర్ చెక్ అనేది తప్పనిసరి. అంతేకాదు ఈ కరోనా టైమ్‌లో ఫీవర్ చెకింగ్ కోసం డిజిటల్ థర్మామీటర్ ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బయో ఇంజినీరింగ్ ప్రొఫెసర్ బెంజమిన్ స్మర్ కొత్తగా స్మార్ట్ రింగ్ వేరబుల్ డివైజ్‌ను కనిపెట్టారు.

చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలు కాగా, అది ఎప్పుడు తగ్గుతుందో ఎవరూ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా పూర్తిగా తగ్గినా మళ్లీ రాదని పక్కాగా చెప్పలేం. ఇక కరోనా టీకా విడుదలై, దాని ఫలితాలు వచ్చేదాకా కూడా టీకా పనితీరుపై అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో పనిమీద బయట తిరగాలంటే కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే, ఎప్పటికప్పుడు ఫీవర్ చెక్ చేసుకుంటూ ఉండటం ఉత్తమం. కానీ థర్మామీటర్‌ను వెంటతీసుకెళ్లడం కుదరదు కదా. అందుకే ఈజీగా చేయికి ధరించిన వేరబుల్.. మన టెంపరేచర్ లెక్కలు చెబితే బాగుంటుందనే ఆలోచనతో బెంజమిన్ ‘స్మార్ట్ రింగ్’ను తయారు చేశాడు. ఈ క్రమంలోనే 65 వేల మంది ‘ఓరా స్మార్ట్ రింగ్’ను ధరించగా, వారి సింప్టమ్స్ ఆధారంగా స్మార్ట్ రింగ్ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మరో 4 వేల మందిపై దీన్ని ప్రయోగించి అల్గారిథమ్‌ను టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ వేరబుల్ డివైజ్ ధరించిన వారికి శరీరంలో ఇల్‌నెస్ ఉన్నా, టెంపరేచర్ పెరిగినా అలర్ట్ రావడంతో పాటు హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, ఫిజికల్ యాక్టివిటీ లెవల్స్ అన్నింటిని రీడ్ చేయగలదు. ఫిన్నీస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ స్మార్ట్ రింగ్‌ను తయారుచేసింది. స్మార్ట్ రింగ్ పనితీరు తెలుసుకునేందుకు చేపట్టిన ట్రయల్స్‌లో 50 మందికి కరోనా ఉందని గుర్తించినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed