సాగర్ జలాశయానికి స్మార్ట్ బోట్

by  |
సాగర్ జలాశయానికి స్మార్ట్ బోట్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయంలోకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ బోటును శుక్రవారం తీసుకొచ్చారు. సాగర్ జలాశయం పర్యాటకులను నంది కొండకు తీసుకెళ్లేందుకు 60 సీట్ల సామర్థ్యం ఉన్న బోటును విశాఖపట్నం నుంచి సాగర్​కు తెచ్చారు. బోటుకు తుది మెరుగులు దిద్ది..

త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు లాంచీ స్టేషన్​ అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి లాంచీలను తిప్పడం లేదు. లాంచీ స్టేషన్​లో ఇప్పటికే 150 మంది పర్యాటకుల సామర్థ్యం కలిగిన 2 లాంచీలు ఉండగా.. తక్కువ మందితో నంది కొండకు తిప్పడం కోసం ఈ నూతన బోటును ఏర్పాటు చేసినట్టు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.



Next Story