చిరు వ్యాపారులకు రుణ సౌకర్యం

by Shyam |
చిరు వ్యాపారులకు రుణ సౌకర్యం
X

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎం.ఎస్.ఎం.ఈ) ఎలాంటి హామీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అత్యవసర జిల్లాస్థాయి కన్సల్టేటివ్ కమిటీ, డీ.ఎల్.ఆర్.ఎస్ సమావేశాలు కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద అత్యవసర రుణ హామీలో భాగంగా అర్హత కలిగిన చిరు వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇప్పటికే ఉన్న తనకా ఆస్తుల హామీతో 20 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు వివరించారు. కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా 7 .5 శాతం నుంచి 9.5 శాతం వడ్డి వర్థిస్తూ.. నాలుగేళ్ల వరకు తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నామని అన్నారు. మొదటి సంవత్సర చెల్లింపు‌పై పూర్తి మారటోరియం ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, లీడ్ బ్యాంకు అధికారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గీత, బ్యాంకర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed