- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మండే రైలును కాపాడిన ప్రయణికులు! యూపీలో తప్పిన పెనుప్రమాదం
దిశ, వెబ్‌డెస్క్ః ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. ఈరోజు దౌరాలా స్టేషన్‌లో ఆగి ఉన్న సహరాన్‌పూర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలు ఇంజన్‌లో, దాని వెనకున్న రెండు కోచ్‌లల్లో మంటలు చెలరేగాయి. రైలు కదలకపోవడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే, మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా మిగిలిన బోగీలను వేరు చేయడానికి ప్రయాణికులే రైలును నెట్టడం విశేషం. ప్రమాదకరమైన పరిస్థితుల్లో భయానికి లోనుకాకుండా అందరూ కలిసి రైలును తోస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేయగా "భేష్.." అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు గానీ, ప్రాణనష్టం గానీ జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వైకె ఝా తెలిపారు.