- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కారణంగా పెరిగిన స్కైప్ వాడకం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం కారణంగా మైక్రోసాఫ్ట్ వారి స్కైప్ వాడకం విపరీతంగా పెరిగిపోయినట్లు సంస్థ ప్రకటించింది. క్వారంటైన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనులు చక్కబెడుతుండటంతో వీడియోకాలింగ్ అవసరం పెరిగింది. దీంతో ఈ నెల స్కైప్ వాడకం దాదాపు 70 శాతం పెరిగినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుతం స్కైప్‌ను 40 మిలియన్ల మంది వాడుతున్నారని సంస్థ తెలిపింది.
స్కైప్ టు స్కైప్ కాలింగ్ మినిట్స్ 220 శాతం పెరిగినట్లు సంస్థ బ్లాగు పోస్టులో పేర్కొంది. అంతేకాకుండా ఏప్రిల్ 21 నుంచి తమ ఆఫీసు 365ని మైక్రోసాఫ్ట్ 365 పేరుతో రీబ్రాండింగ్ చేయబోతున్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అంతేకాకుండా ప్రత్యేకంగా వర్క్‌ప్లేస్ అవసరాలను తీర్చడానికి మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది. మరోవైపు క్వారంటైన్ కారణంగా వీడియో కాలింగ్ యాప్‌లైన జూమ్ వంటి యాప్‌ల స్టాక్‌ల ధరలు అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
Tags : Corona, COVID 19, Quarantine, Microsoft, Skype, Zoom