- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిడ్-సైజ్ సెడాన్ 'ర్యాపిడ్ స్పెషల్ ఎడిషన్' కారును విడుదల చేసిన స్కోడా
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తన మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్ లిమిటెడ్ ఎడిషన్‌ను సోమవారం మార్కెట్లో లాంచ్ చేసింది. రూ. 11.99 లక్షల(ఎక్స్‌షోరూమ్) వద్ద దీని ధర ప్రారంభమవుతుందని, ఇది కార్బన్ స్టీల్ మ్యాటే కలర్‌లో లభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆటోమెటిక్‌తో పాటు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చినట్టు స్కోడా ఆటో ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ రూ. 11.99 లక్షలు అని, ఆటోమెటిక్ వేరియంట్ రూ. 13.49 లక్షలతో లభించనున్నట్టు పేర్కొంది. 2011లో ఈ మోడల్ దేశీయ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి లక్ష మందికి పైగా వినియోగదారులతో విజయవంతమైన మోడల్‌గా నిలిచిందని, ఈ క్రమంలోనే ర్యాపిడ్ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చాము. దీని ద్వారా కొత్త కస్టమర్లకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో ర్యాపిడ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనున్నట్టు’ స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హాలిస్ అన్నారు. ఈ స్పెషల్ ఎడిషన్‌లో బ్లాక్ డోర్ హ్యాండిల్ సహా సైడ్ మౌల్డింగ్, ట్రంక్ లిప్ గార్నిష లాంటి కొత్త డిజైన్ ఫీచర్లను అందించామన్నారు. డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి భద్రతా ఫీచర్లను ఈ పోర్ట్‌ఫోలియోలో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.