కార్లను లీజుకు ఇవ్వనున్న స్కోడా ఇండియా!

by Harish |
కార్లను లీజుకు ఇవ్వనున్న స్కోడా ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తన రాపిడ్, సూపర్బ్ మోడల్ కార్లను లీజుకు ఇచ్చే పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా వినియోగదారులు 26-60 నెలల మధ్య కార్లను నెలవారీ అద్దె కింద తీసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. వినియోగదారులు రూ.22,580 నుంచి అద్దె చెల్లించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ పథకం ద్వారా రిటైల్, కార్పొరేట్ వినియోగదారులను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా లాంటి ప్రధాన నగరాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు స్కోడా ఇండియా పేర్కొంది. ‘ఆటో పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పులకు తగినట్టు అభివృద్ధి జరగాలని భావిస్తున్నాం. రానున్న రెండేల్లలో లీజింగ్ విధానం అనేక రెట్లు పెరుగుతుందని ఆశిస్తున్నామని’ స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హొలిస్ చెప్పారు.

Advertisement

Next Story