క్వారంటైన్ నరకం : మహ్మద్ షమీ

by  |
క్వారంటైన్ నరకం : మహ్మద్ షమీ
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంటిలో గడిపినప్పటి కంటే.. యూఏఈలో హోటల్ గదిలో వారం రోజులు ఒంటరిగా గడపడం నరకంలా అనిపించిందని టీమ్ ఇండియా, కింగ్స్ ఎలెవెన్ పేసర్ మహ్మద్ షమీ అన్నారు. ఐపీఎల్ 13వ సీజన్‌ ఆడటానికి యూఏఈ చేరుకున్న షమీ.. నిబంధనల ప్రకారం దుబాయ్‌లోని హోటల్‌ గదిలో క్వారంటైన్‌లో గడిపాడు. క్వారంటైన్ గడువు ముగియడంతో ప్రాక్టీస్ ప్రారంభించిన షమీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘లాక్ డౌన్ సమయంలో నాలుగు నెలలు అందరికీ కష్టంగానే ఉండింది. ఆ సమయంలో ఏ క్రికెటర్ కూడా బయటకు వెళ్లలేదు. నాకు సొంతంగా కాస్త స్థలం ఉండటంతో ప్రాక్టీస్ చేసుకున్నా. అయితే యూఏఈ వచ్చిన తర్వాత ఆరు రోజులు ఒకే గదిలో గడపడం నరకంలా ఉంది. ఆ నాలుగు నెలల కంటే ఈ వారం రోజులు చాలా కష్టంగా గడిచింది’ అని షమీ అన్నాడు. అప్పట్లో ప్రాక్టీస్ కోసం మా సోదరులు ఉండే వాళ్లు కానీ.. ఇక్కడ మాట్లాడటానికి పక్కన మనిషి కూడా లేకపోవడం చాలా బాధించిందని షమీ వెల్లడించాడు. కాగా రవిచంద్రన్ అశ్విన్ కూడా తనకు ఈ క్వారంటైన్ సమయం జీవితంలోనే అత్యంత చెత్త సమయం అని పేర్కొనడం విశేషం. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆటగాళ్లందరూ యూఏఈ చేరుకున్నారు.


Next Story

Most Viewed