తమన్నాను మరిపించేలా సితార స్టెప్స్

by  |
తమన్నాను మరిపించేలా సితార స్టెప్స్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార మరోసారి సోషల్ మీడియా అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. తన డ్యాన్స్‌తో మరోసారి అదరహో అనిపించింది. మహేష్ లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు మూవీలో డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్‌కు సూపర్ స్టెప్స్ వేసింది. సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా వేసిన స్టెప్పులను బీట్ చేసింది. ఇంతకుముందు కూడా ఇదే సినిమాలోని హీ ఈజ్ క్యూట్ సాంగ్‌తో మెస్మరైజ్ చేసింది సీతు పాప.

డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్‌పై సితార డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్.. మై డాన్సింగ్ క్వీన్ అంటూ పోస్ట్ పెట్టారు. వీడియో ఇప్పటికే వైరల్ కాగా మహేష్ ఫ్యాన్స్ సితార డ్యాన్స్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. కాగా సితార తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఆద్య అండ్ సితార పేరులో స్టార్ట్ చేసిన యూట్యూబ్ చానల్ మంచిపేరు తెచ్చిపెట్టింది. క్యూట్ క్యూట్‌గా సెలబ్రిటీస్‌ను ఇంటర్వ్యూ చేస్తూ ముచ్చటేస్తున్నారు పిల్లలు. రీసెంట్‌గా తండ్రి మహేష్‌ను కూడా ఇంటర్వ్యూ చేసింది సీతు పాప.


Next Story

Most Viewed