సీతక్క Vs టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

by Shyam |
సీతక్క Vs టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోడు భూముల విషయంలో సీతక్క మాటలకు కౌంటర్ ఇస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు. బాలరాజు మాట్లాడిన అనంతరం.. స్పీకర్ పోచారం, సీతక్కకు మైక్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంలో మంత్రి సత్యవతి రాథోడ్ పోడు భూముల సమస్యపై సమాధానం చెప్పారు. సభలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ.. రైతుల కోసం ఫారెస్ట్ అధికారులతో తనకు వాగ్వాదం జరిగిందన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వాలు పోడు భూముల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రజల పక్షాన నిలవాల్సిన సమయంలో ఇతర పార్టీలు తనపై దాడికి దిగారని అన్నారు.

సీతక్కకు ట్రైబల్స్ పట్ల నిజంగా పట్టింపు ఉంటే రైతుల కోసం ప్రభుత్వం పోరాటం చేసే సమయంలో తమకు మద్దతు ఇవ్వలేదన్నారు. మద్దతు ఇవ్వకపోగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని.. చెంచు అవుదారులను అవమానించే విధంగా సీతక్క మాట్లాడొద్దని అన్నారు. చెంచుల సమస్యలు పరిష్కరించడం కేవలం సీఎం వల్ల మాత్రమే అవుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed