- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రావి చెట్టు కింద కూర్చో ఆక్సిజన్ వస్తది’
లక్నో : దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో కరోనా పేషెంట్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వారికి చికిత్స అందించకున్నా కనీసం ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలకు దారి తీస్తున్నది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక కరోనా బాధితుడి కుటుంబసభ్యుడు అక్కడ ఉన్న ఆస్పత్రులన్నీ తిరిగి ఓపిక నశించి.. ఆక్సిజన్ కోసం ఎక్కడికి వెళ్లాలి.? అని ప్రశ్నిస్తే ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ‘రావి చెట్టు కింద కూర్చో.. కావల్సినంత ఆక్సిజన్ లభిస్తుంది..’ అంటూ వ్యంగ్యంగా చెప్పాడు. ప్రయాగ్‌రాజ్ నుంచి లక్నో దాకా ఎక్కడికివెళ్లినా తమకు ఆస్పత్రులలో బెడ్స్ లేవని, ఆక్సిజన్ కొరత ఉందని చెబుతున్నారని పేషెంట్ల తరఫు బంధువులు వాపోతున్నారు. ‘ప్రయాగ్‌రాజ్ నుంచి లక్నో దాకా అన్ని ఆస్పత్రులకు వెళ్లాం. మేదాంత, అపోలోలో కూడా అడిగి చూశాం. ఎక్కడికెళ్లినా బెడ్లు ఖాళీ లేవు అంటున్నారు. బతిలాడి లోపలికి వెళ్దామనుకుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. మేమెక్కడికి వెళ్లాలి చెప్పండి..’ అంటూ ఓ పేషెంట్ బంధువు వాపోయాడు.