కరోనా నియంత్రణకు రూ.లక్ష విరాళం

by vinod kumar |
కరోనా నియంత్రణకు రూ.లక్ష విరాళం
X

దిశ,మహబూబ్ నగర్: జిల్లాలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన అక్క చెల్లెళ్లు హెచ్.వి.పద్మావతి (విశ్రాంత అధ్యాపకులు), హెచ్.వి. సరోజ (విశ్రాంత ప్రిన్సిపాల్)లు కరోనా నియంత్రణకు లక్ష రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావుకు అందజేశారు. రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్లు అయిన పద్మావతి, సరోజలు రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజుతో కలిసి కలెక్టర్‌‌కు విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వెచ్చించాలని కోరగా, జిల్లా కలెక్టర్ అందుకు అంగీకరించారు. అంతేకాకుండా తన నిధుల నుంచి మరో లక్ష రూపాయలు ప్రకటించారు. మొత్తం రెండు లక్షలను పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. గతంలో కూడా అక్క చెల్లెళ్లు కేరళ వరద బాధితులకు తమ వంతుగా లక్ష రూపాయలను ప్రకటించి సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.

tags:coronavirus, one lakh rupees, mahabubnagar, red cross, collector



Next Story