- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్న వేధింపులతో చెల్లి ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: ఆకతాయిల వేధింపుల నుంచి చెల్లికి అండగా నిలవాల్సిన అన్న ఆమె పాలిట యముడయ్యాడు. వరుసకు చెల్లి అని తెలిసిన ప్రేమించాలంటూ వేధించసాగాడు. అన్న తనను ప్రేమించడం, శారీరకంగా వేధించడం ఏంటని తనలో తాను కుమిలిపోయిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.
వివరాళ్లోకి వెళితే.. నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధి గగులోతు తండాకు చెందిన ఓ యువతి(17)ని.. ఇదే తండాకు చెందిన గగులోతు సురేశ్ అన్నయ్య వరుస అవుతాడు. అయినప్పటికీ, ఆ యువతిని ప్రేమించాలంటూ వేధించాడు. అతడి వేధింపుల పై తల్లిదండ్రులకు చెప్పుకోలేక బాధితురాలు తనలో తాను కృంగి పోయింది.
అతడి మానసిక వేధింపులను ఓర్చుకున్న బాధితురాలు.. శారీరకంగా కూడా వేధించడంతో తట్టుకోలేకపోయింది. ఈ నెల 26 వ తేదీన ఆ యువతి ఇంటికొచ్చిన సురేశ్ తన కోరిక తీర్చాలంటూ పట్టుబట్డాడు. దీంతో యువతి ఎంతో మానసిక క్షోభ కు గురై పురుగుల మందు తాగేసింది. ఇది తెలుసుకున్న కుటుంబీకులు ఆమెను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు.
అయితే, ఇదే మండలంలో సరిగ్గా వారం రోజుల క్రితం ఓ యువతిని.. బాబాయ్ వరుస అయిన వ్యక్తి ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. లైంగికంగా కూడా వేధించడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగి పది రోజుల వ్యవధిలో మండలంలో మరో ఘటన వెలుగుచూడటం కలకలం రేపింది.