ఆ ఐదు వికెట్లు నా తండ్రికి అంకింతం: సిరాజ్

by Anukaran |   ( Updated:2021-01-21 12:36:07.0  )
ఆ ఐదు వికెట్లు నా తండ్రికి అంకింతం: సిరాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌ టెస్టు సిరీస్‌లో సత్తా చాటి నగరానికి చేరుకున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ శోకసంద్రంలో మునిగాడు. సిరీస్ ప్రారంభం ముందు తన తండ్రి మహ్మద్ గౌస్ మరణించారు. తండ్రి మరణ వార్త విన్న సిరాజ్ అప్పటికే ఆస్ట్రేలియా టూర్‌లో బిజీగా ఉన్నాడు. తిరిగి స్వదేశానికి వద్దామని మనస్సు కొట్టుకున్నా.. తన తండ్రి కలను సాకారం చేసేందుకు అక్కడే ఉండిపోయాడు. ఎలాగైనా టెస్టు సిరీస్ సమర్థంగా రాణించాలని.. తండ్రి కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సీరిస్‌లో విక్టరీ కొట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. గురువారం నగరానికి వచ్చిన వెంటనే తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాడు.

అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన సిరాజ్.. ఆస్ట్రేలియా జట్టుపై తీసుకున్న వికెట్లు తన తండ్రికి అంకితం చేస్తున్నానని చెప్పాడు. నాన్న చనిపోయిన తరువాత తనకు చాలా కఠినమైన పరిస్థితి ఎదురైందని.. అయినప్పటికీ ఓకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయగలిగినందుకు కృతజ్ఞుడను అని అన్నాడు. దీనికి తోడు ఇటువంటి సమయంలో తన తల్లి మ్యాచ్‌పై ఫోకస్‌ చేసేందుకు మానసికంగా బలంగా ఉండాలని ప్రొత్సహించారన్నారు. ఇటువంటి సమయంలో తన తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా ఆసీస్‌ టెస్టు సిరీస్‌ను విజయవంతంగా ముగించుకున్నానని మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చారు. కఠిన సమయంలో కూడా భారత జట్టు తనకు అండగా నిలిచిందని చెప్పాడు. కాగా, తొలి సారిగా ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్ మొత్తం సిరీస్‌ మొత్తంగా 13 వికెట్లు తీసుకోగా.. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. చివరకు అనుకున్న కలను నెరవేర్చిన సిరాజ్ పక్కన తన తండ్రి లేకపోవడం బాధాకరం.

Advertisement

Next Story

Most Viewed