- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ మెంటార్‌గా లెజెండరీ డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్ : డార్లింగ్ హీరో ప్రభాస్.. క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుండగా.. ఇప్పటికే అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఆ క్రేజ్‌ను ఇంకా పెంచేలా ఉంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకుల్లో ఒకరైన సింగీతం.. ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది చిత్ర యూనిట్.
‘పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369, భైరవద్వీపం’ వంటి గొప్ప గొప్ప సినిమాలతో.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిన దర్శకుడు సింగీతం. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేని కాలంలోనే ఆయన వెండితెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకుడు ఆయన. మరి టెక్నాలజీ ఎంతగానో పెరిగిన ఈ కాలంలో సింగీతం.. నాగ్ అశ్విన్‌తో కలిసి ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.
‘మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల ఇప్పటికి నెరవేరనుంది. సింగీతం శ్రీనివాసరావు గారిని మా ఎపిక్ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు’ అని మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
A long awaited dream finally comes true. We are thrilled to welcome #SingeetamSrinivasaRao Garu to our epic.
His creative superpowers will surely be a guiding force for us.#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/Mxvbs2s7R9— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2020