సింగరేణి కార్మికుల ఔదార్యం.. చిరు వ్యాపారులకు సాయం

by Sridhar Babu |   ( Updated:2021-06-18 05:40:24.0  )
Singareni-workers
X

దిశ, మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసీ-2 ఆధ్వర్యంలో పట్టణంలోని బండారుగూడెం సెంటర్‌లో రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకునే మహిళలకు నిత్యావరసర వస్తువులు అందజేశారు. శుక్రవారం సింగరేణి అధికారులు, కార్మికులు చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల కష్టాలను పత్రికల్లో చూసి తాము స్పందించామని, కరోనా కష్ట కాలంలో వారి జీవితాలలో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. చిరు వ్యాపారుల కోసం సింగరేణి నుంచి అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డంపర్ సెక్షన్ అధికారులు దాసరి రాజశేఖర్, కే.సుదర్శన్ రెడ్డి, కార్మికులు ఎల్. నరేష్, అత్తులూరి రవీందర్, సింగరేణి సేవా సమితి సభ్యులు గుండాల ఉపేందర్, సయ్యద్ నాజర్ పాషా, చిరు కూరగాయల వ్యాపారుల సంఘం అధ్యక్షులు మెండు సాగర్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story