- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సినేషన్ తర్వాత వారం పాటు చేయకూడదా?
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట వ్యాక్సిన్ల పట్ల నెలకొన్న అపోహల వల్ల చాలా మంది టీకా తీసుకునేందుకు భయపడగా.. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కానీ వ్యాక్సినేషన్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. రీసెంట్‌గా సింగపూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జిమ్‌లో వెయిట్స్ లిఫ్ట్ చేయడంతో కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. దీంతో ఆ దేశ హెల్త్ అథారిటీస్ పోస్ట్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతమున్న మార్గదర్శకాలను అప్‌డేట్ చేసింది.
కొవిడ్-19కు వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల వరకు కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలని చెప్పిన సింగపూర్ ప్రభుత్వం.. ముఖ్యంగా కౌమార దశ నుంచి 30 ఏళ్ల లోపున్న వ్యక్తులు ఈ జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. కాగా ఇంతకుముందు ఈ పరిమితి 12-24 గంటల వరకే ఉంది. ఇక జిమ్‌లో బరువులెత్తిన 16 ఏళ్ల బాలుడు గుండెపోటుకు రావడం వెనుక వ్యాక్సినేషన్ కాకుండా ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయా తెలుసుకునేందుకు హెల్త్ అథారిటీస్ విచారణ చేపట్టాయి. సదరు బాలుడు జూన్ 27న ఫైజర్-బయోటెక్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా జూలై 13న అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతానికి అతడు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడగా.. క్లినికల్ అండ్ లేబొరేటరీ టెస్టుల ఫలితాలు వస్తే దీనిపై క్లారిటీ వస్తుందని సింగపూర్ హెల్త్ మినిస్టర్ వెల్లడించారు.
అయినప్పటికీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కొనసాగించాలని సూచించిన నిపుణుల కమిటీ.. టీకా అందించే రక్షణ ప్రయోజనాలే దాని వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలను కూడా తప్పిస్తాయని పేర్కొంది. ఇజ్రాయెల్, యూఎస్‌లోని కొందరు పురుషుల్లోనూ గుండె గోడ కండరాలకు సంబంధించి సమస్యలు వెలుగుచూడగా.. వారంతా ఫైజర్ వ్యాక్సినే తీసుకున్నారు. ఈ మూడు దేశాలు కూడా తమ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా mRNA వ్యాక్సిన్లపైనే ఆధారపడుతున్నాయి. కాగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్ తర్వాత గుండె సమస్యలు తలెత్తిన 12 మంది రిపోర్టులు పరిశీలిస్తే.. అందరు ఐలాండ్ జాతీయులే కాక, వారిలో ఏడుగురు 30 ఏళ్ల లోపు పురుషులేనని హెల్త్ అథారిటీస్ వెల్లడించాయి.