శింబు థాంక్స్ నోట్.. మెచ్చిన డైరెక్టర్

by Jakkula Samataha |
శింబు థాంక్స్ నోట్.. మెచ్చిన డైరెక్టర్
X

కోలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ రాధాకృష్ణ పార్థిబన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ శింబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్‌గా కొనియాడారు. తను చాలా స్పెషల్ యాక్టర్ అని, ఇప్పటి వరకు తనతో కలిసి పని చేయలేకపోయినా తన గురించి తెలుసని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. తనతో కలిసి పనిచేయాలని ఉందని తెలిపాడు.

ఈ విషయంపై స్పందించిన శింబు.. తన అసిస్టెంట్‌తో ఫ్లవర్ బొకే, చాకొలేట్, హ్యాండ్ రిటెన్ థాంక్స్ నోట్ ఇచ్చి పంపించడంతో పాటు మీ మాటలు తనకు చాలా ఆనందాన్నిచ్చాయని చెప్పాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన డైరెక్టర్.. శింబు థాంక్స్ చెప్పే విధానానికి తాను ఫిదా అయిపోయానని తెలిపాడు. అసలు మేమిద్దరం కలిసి ఎందుకు పనిచేయలేదని ఇప్పుడు అనిపిస్తోందని.. త్వరలోనే మా కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేస్తానని చెప్పాడు. అభిమానులు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రస్తుతం శింబు.. ‘మన్నాడు, మహా’ సినిమాలతో బిజీగా ఉండగా, పార్థిబన్.. విజయ్ సేతుపతి తుగ్లక్ దర్బార్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

Next Story