- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఫీచర్స్ : గతేడాది నవంబర్‌లో అమెరికాలోని ఉటా రాష్ట్రంలో తొలి మోనోలిత్ (లోహపు స్తంభం) వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి మోనోలిత్‌లు వేర్వేరు చోట్ల వరుసగా ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు వాటి మిస్టరీ వీడకపోగా.. ఒకచోట అదృశ్యమై మరో చోట దర్శనమిస్తున్నాయి. తాజాగా సెంట్రల్ ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ప్రత్యక్షమైన మోనోలిత్‌ను స్థానికులు తగలబెట్టారు. ఈ నెల 14న కాంగో దేశ రాజధాని కిన్షాస నగరంలో 12 అడుగుల సిల్వర్ మోనోలిత్‌ను స్థానికులు గుర్తించారు.
ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో దాన్ని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. మోనోలిత్ పక్కనే నిలబడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అయితే దీన్ని కావాలని కొందరు పాతిపెట్టారని, లోహపు ఫ్రేములతో తయారు చేశారని తెలియడంతో కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో ఈ వార్తలు వైరల్ కావడంతో కొందరు ఈ మోనోలిత్‌ను కట్టెలతో కొట్టి, నిప్పంటించి తగలబెట్టారు. ఈ విషయమై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. అసలు ఎందుకు ఇలా మోనోలిత్‌లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రపంచంలో ఈ మోనోలిత్ మిస్టరీ వీడేలా లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.