టీకా ట్రయల్స్ నిలిపేసిన సీరం

by  |
టీకా ట్రయల్స్ నిలిపేసిన సీరం
X

న్యూఢిల్లీ: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి తదుపరి సూచనలు వచ్చిన తర్వాతే మళ్లీ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఆస్ట్రా జెనెకా ట్రయల్స్ పున:ప్రారంభించేవరకూ భారత్‌లో ట్రయల్స్‌కు బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపింది.

ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా ట్రయల్స్‌లో ఒక పార్టిసిపెంట్‌లో అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆస్ట్రా జెనెకా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాలను ఎందుకు వివరించలేదని ఎస్ఐఐకి డీసీజీఐ షోకాజు నోటీసులు పంపింది. దేశంలో రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సేఫ్టీ అంశాలను దృష్టిలో పెట్టుకుని యూకే ట్రయల్స్‌లో తలెత్తిన సమస్యను వివరించాల్సిందని పేర్కొంది.


Next Story

Most Viewed