క్రిప్టోకరెన్సీ పేమేంట్స్ ఫీచర్స్‌ను పరీక్షిస్తున్న ‘సిగ్నల్’

by Sujitha Rachapalli |
క్రిప్టోకరెన్సీ పేమేంట్స్ ఫీచర్స్‌ను పరీక్షిస్తున్న ‘సిగ్నల్’
X

దిశ, ఫీచర్స్ : మెసేజింగ్, సర్వీస్ యాప్స్ అన్నీ కూడా ‘పేమెంట్స్ ఫీచర్స్’‌ ఇంట్రడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్‌క్రిఫ్టెడ్ మెసేజింగ్ యాప్ ‘సిగ్నల్’.. తమ బీటా వెర్షన్‌లో కొత్త పీర్-టు-పీర్ చెల్లింపుల వ్యవస్థను పరీక్షిస్తోంది. ఏదేమైనా సిగ్నల్ యూజర్లు, తమ బ్యాంక్ ఖాతాలను లేదా డెబిట్ కార్డులను లింక్ చేయకూడదని భావిస్తోంది. అందుకే ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న క్రిప్టోకరెన్సీ ఆధారంగా పేమెంట్స్ చేయాలనుకుంటోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వినియోగదారుల కోసం బీటా బిల్డ్‌లో అందుబాటులో ఉండగా.. ఇతర దేశాల్లో ఇంకా టెస్టింగ్ ప్రారంభించలేదు.

‘సిగ్నల్’ ప్రస్తుతం తమ ‘పేమెంట్స్ ఫీచర్’ కోసం మొబైల్‌కాయిన్ వాలెట్‌తో జట్టుకట్టింది. మొబైల్‌కాయిన్ అనేది క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్ కాగా.. ఇది మొబైల్ కోసం పీ2పీ(పీర్ 2 పీర్) చెల్లింపు టోకెన్లను, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. పేమెంట్స్ విషయంలో యూజర్‌కు సెక్యూరిటీతో పాటు ప్రైవసీ అందిస్తుంది. మొబైల్‌కాయిన్ వాలెట్‌ను ‘సిగ్నల్‌’కు లింక్ చేసిన తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపడం, స్వీకరించడం వంటి లావాదేవీలను ప్రారంభించవచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన వివరాలు పంపినవారితో పాటు స్వీకరించేవారికి మాత్రమే తెలుస్తుంది.

‘మీ డేటా మా చేతుల్లో కాకుండా మీ చేతుల్లో ఉంచడమే సిగ్నల్ ఉద్దేశం. మొబైల్ కాయిన్ రూపొందించిన ప్రకారం.. బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ హిస్టరీ లేదా ఫండ్స్‌కు సంబంధించిన ఏ విషయంలోనూ సిగ్నల్‌కు యాక్సెస్ ఉండదు. భవిష్యత్తులో యూజర్ మరొక యాప్ లేదా సేవకు మారాలనుకుంటే ఎప్పుడైనా తమ నిధులను కూడా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది’ అని సిగ్నల్స్ హెడ్ ఆఫ్ గ్రోత్ అండ్ కమ్యూనికేషన్ జూన్ హరాడా తెలిపాడు.

Advertisement

Next Story