లక్ష వాహనాలు సీజ్

by Shyam |
లక్ష వాహనాలు సీజ్
X

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎంత పకడ్బందీగా అమలుచేయాలనుకుంటున్నప్పటికీ ఏదో ఒక కారణంతో రోడ్లమీదకు వాహనాలు వస్తూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేయడం పోలీసులకు శక్తికి మించిన పని అవుతోంది. అందుకే సరైన కారణం లేకుండా రోడ్డుమీదకు వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు సీజ్ చేస్తున్నారు. గడిచిన పది రోజుల్లో లక్షకు పైగా వాహనాలను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీజ్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించనందుకు మంగళవారం ఒక్కరోజే 7వేల బైక్‌లను, 181 ఆటోరిక్షాలను, 290 కార్లను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.11 లక్షల వాహనాలను సీజ్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్ తెలిపారు. అందులో సుమారు ఐదు వేల ఆటోరిక్షాలు, 3,400 కార్లు, 539 ఇతర వాహనాలుల ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 8,500 కేసుల్ని కూడా బుక్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పాస్‌లను తప్పనిసరి చేయడంతో గురువారం నుంచి రోడ్లమీదకు వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, ప్రభుత్వం ఆశించిన తీరులో లాక్‌డౌన్‌ను అమలుచేయడం సాధ్యమవుతుందని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Hyderabad, LockDown, Vehicles, Police, Seize, COVID Passes

Advertisement

Next Story

Most Viewed