- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామలింగారెడ్డి ఆదర్శప్రాయుడు
by Shyam |
X
దిశ, సిద్దిపేట: జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా భిన్నకోణాల్లో ప్రజాజీవితంతో మమేకమై పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి జీవితం నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శనీయమని సిద్దిపేట జర్నలిస్టులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా వర్కింగ్ జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి జర్నలిస్టులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సుమారు 25 సంవత్సరాలు జర్నలిస్టుగా రామలింగారెడ్డి ప్రజా సమస్యలపై పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రెస్ అకాడమీ సభ్యుడు కె.అంజయ్య, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు కె. రంగాచారి, సీనియర్ జర్నలిస్టులు నాగరాజు, అరుణ్, రఘు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story