- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ అయితే కరోనా రాదా..? మళ్లీ మాస్క్ ధరించని సిద్దిపేట కలెక్టర్!
దిశ ప్రతినిధి, మెదక్ : సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్ రావు, సీపీ జోయల్ డేవిస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కొవిడ్ కారణంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పాల్సిన జిల్లా అధికారే.. మాస్క్ ధరించడం లేదు.
శుక్రవారం మాస్క్ ధరించకుండా కనిపించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ విషయంపై ‘దిశ’లో కలెక్టర్‌కు కరోనా రూల్స్ వర్తించవా. అంటూ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై చాలా మంది సామాన్యులు స్పందించారు. అయినా కలెక్టర్ తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. దీనిపై సీపీ జోయల్ డేవిస్ సైతం స్పందించలేదు. కరోనా రూల్స్ పాటించని జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కలెక్టర్ తీరుతో మంత్రి హరీష్ రావు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన మాస్క్ లేకుండా మంత్రి వెన్నంటే ఉండి.. ఎక్కడ తమ అభిమాన నాయకుడిని అనారోగ్యంపాలు చేస్తారో అని కలవరపడుతున్నారు.