- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వీడియో విడుదల చేస్తాం -సిద్ధిపేట సీపీ
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్ : దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల ఘటనలో వచ్చిన ఆరోపణలపైసిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పందించారు. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని పేర్కొన్నారు. ఉపఎన్నిక దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, ముందస్తు సమాచారంతోనే రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించామని స్పష్టం చేశారు. మా సిబ్బందే డబ్బు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
డబ్బు దొరికిన ఇంటి యజమానితో పాటు పంపించిన వ్యక్తి సంతకాలు కూడా తీసుకున్నామని తెలియజేశారు. ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేస్తున్నామన్న సీపీ… ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్కువమంది ఉండడం వల్లే డబ్బు లాక్కెళ్తున్నా అడ్డుకోలేకపోయామన్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేస్తామని తెలిపారు.
Next Story