‘వాగులు దాటే ప్రయత్నం ఎవరూ చేయొద్దు’

by Shyam |   ( Updated:26 Sept 2020 4:19 AM  )
‘వాగులు దాటే ప్రయత్నం ఎవరూ చేయొద్దు’
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు కమిషనర్ జోయల్ డెవిస్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గ్రామాల్లో వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున, ఉధృతి తగ్గేవరకూ ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచనలు జారీ చేశారు. రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా స్టాపర్లు, కట్టెలు తదితర వస్తువులు వేసి ఎవరూ వేయొద్దని హెచ్చరించారు. సంబంధిత గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులకు గ్రామాలలో చాటింపు చేయాలని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.

Next Story