- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయాలి
దిశ, సిద్దిపేట: కోవిడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి కోరారు. మంగళవారం పోలీసు కమిషనర్ జోయల్ డెవీస్‌తో కలిసి సిద్దిపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ బాధితులకు సామాజిక బాధ్యతగా వైద్య సేవలు అందించాలన్నారు. కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు.
పట్టణ సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేకంగా కోవిడ్ తాత్కాలిక ఆసుపత్రులుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కోవిడ్ బాధితుల చికిత్సకు నిర్దిష్ట రేట్లను ఫిక్స్ చేస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడంతో ఆర్థిక స్థోమత ఉన్న వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళతారన్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే వీలు కలుగుతుందనీ కలెక్టర్ తెలిపారు.