మక్కలొద్దు.. కంది ముద్దు

by  |
మక్కలొద్దు.. కంది ముద్దు
X

దిశ, మెదక్: వానాకాలంలో మొక్కజొన్నకు బదులు కంది, పత్తి పంటలు సాగు చేయాలని సిద్దిపేట అదనపు జిల్లా కలెక్టర్ పద్మాకర్ రైతులకు సూచించారు. నియంత్రిత పంటల సాగు విధానంపై సోమవారం సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాల గ్రామంలో గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న నిల్వలు అధికంగా ఉండటంతో దాళారులు తక్కువ ధరలకే కొనుగోలు చేసే ఆస్కారం ఉంటుందని, దీంతో యాసంగిలో మక్కలు సాగు చేయాలని సూచించారు. మొక్కజొన్న స్థానంలో కంది, పత్తి పంటలు వేయాలని కోరారు. వానాకాలం పంటల సాగుకు కావల్సిన ఎరువులను గ్రామాల్లోనే రైతులకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈజీఎస్ మెంబర్ తుపాకుల బాలరంగం, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ జనార్ధన్ రెడ్డి, గ్రామ రైతు సమితి అధ్యక్షుడు కనకయ్య, సిద్దిపేట మండల వ్యవసాయ అధికారి పరశురామ్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed