కర్రసాము నేర్చుకుంటున్న బాలీవుడ్ హీరో

by Jakkula Samataha |
కర్రసాము నేర్చుకుంటున్న బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ అండ్ చార్మింగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది లేటెస్ట్‌గా ‘యుధ్ర’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ కాగా, ఫర్హాన్ అక్తర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ అమేజింగ్ రెస్పాన్స్ అందుకోగా.. మర్డరర్‌గా కనిపించబోతున్నారు సిద్ధాంత్. కాగా ఈ మూవీ కోసం ‘బో స్టాఫ్ స్పిన్నింగ్’లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. యుద్ధ కళలతో ముడిపడి ఉండే ‘బో స్పి్న్నింగ్’.. స్ట్రైక్స్, బ్లాక్స్, స్పిన్స్‌తో మిక్స్ అయి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కేవలం కర్రసాము మాత్రమే కాదు, తన చిజిల్డ్ బాడీకి ఇంటర్నెట్ మెల్ట్ అయిపోయింది.

Advertisement

Next Story