- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11 ఏళ్ల కనిష్ఠానికి ప్యాసింజర్ వాహన విక్రయాలు
దిశ, వెబ్‌డెస్క్: ఏడాది క్రితం మందగమనంతో దెబ్బతిన్న వాహన విక్రయాలు ఈసారి మరింత దారుణంగా పడిపోయాయి. మే తర్వాత కోలుకున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో రికవరీ జరగలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగంలో అమ్మకాలు దారుణ స్థితిలో పతనమవుతాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్(సియామ్) తెలిపింది.
ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 11 ఏళ్ల కనిష్ఠానికి దిగజారుతాయని సియామ్(SIAM) భావిస్తోంది. 2009-10 నాటి కంటే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తోంది. అనేక రంగాల్లో డిమాండ్ లేమి కారణంగా ఇతర రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంది. దీంతో పరిశ్రమ సామర్థ్యం 50-60 శాతం ఉండవచ్చునని సియామ్ పేర్కొంది. గతేడాది జులైతో పోలిస్తే ఈసారి వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. కానీ అమ్మకాలు మాత్రం దిగజారాయి.
టూ-వీలర్ (two wheeler), కమర్షియల్, ప్యాసింజర్, త్రీ-వీలర్ (three wheeler) వాహనాల విక్రయాలు కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల క్షీణించాయి. ఇటీవల కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మొత్తం అమ్మకాలను నమోదు చేయలేకపోయాయి. దీనికితోడు, రికవరీ నెమ్మదిగా ఉందని సియామ్ తెలిపింది.