- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం చేస్తారని వెళితె బెల్టుతో కొట్టాడు
దిశ. ఏపీ బ్యూరో: న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్సై బెల్టుతో కొట్టాడని బాధితురాలు పోలీసు స్టేషన్ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన ఆదివారం తిరుపతి ఎమ్మార్పల్లి పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. ఉప్పర్‌పల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు వనిత వాణి, శకుంతల ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటున్నారు. వాటిని పశువులు తినేశాయి. దీంతో వాళ్లు పశువులను బంధించారు. విషయం తెలుసుకున్న పశువుల యజమానులు అక్కడికి చేరుకుని అక్కాచెల్లెళ్లను దుర్బాషలాడారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు.
వెంటనే బాధితులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రక్షక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి దాడి చేసిన వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనపై పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వారు వెళ్లారు. ఎస్సై ప్రకాశ్ కుమార్‌కు విషయం చెబుతుండగా దుర్బాషలాడి బెల్ట్‌తో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. సీఐ సురేంద్రరెడ్డి వాళ్లకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.