ఆ గ్రామాల్లో కార్డన్ సెర్చ్.. వారే టార్గెట్

by Sridhar Babu |   ( Updated:2021-09-11 00:45:01.0  )
ఆ గ్రామాల్లో కార్డన్ సెర్చ్.. వారే టార్గెట్
X

దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామంలో మహాదేవపూర్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐ రాజ్ కుమార్, సివిల్, సీఆర్‌పీఎఫ్ పార్టీ బలగాలతో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మావోల ప్రభావిత గ్రామాల్లో నిత్యం వాహన తనిఖీలు, కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపించిన, సంచరించిన పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు.

మావోయిస్ట్ సభ్యులకు ఆశ్రయం కల్పించిన, సహయం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని, నిర్ణిత లక్ష్యాలను ఎంచుకొని వాటి దిశగా వెళ్లలాని సూచించారు. గ్రామంలో గుడుంబా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 100కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed