- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 21 రోజులు నరకం చూశా : నటి
దిశ, సినిమా : కన్నడ టెలివిజన్ యాక్ట్రెస్ శ్వేతా చంగప్ప కరోనా కారణంగా ఎంత ఘోరమైన అనుభవాలు ఎదుర్కొందో లైవ్ వీడియోలో వివరించింది. ముందుగా హై ఫీవర్‌తో సఫర్ అయ్యానని, 24 గంటలు పూర్తయినా తగ్గకపోయే సరికి ఫ్యామిలీ మొత్తం కరోనా టెస్ట్‌కు వెళ్లామని తెలిపింది. ఈ పరీక్షల్లో అమ్మకు, తనకు కరోనా పాజిటివ్ రాగా.. వెంటనే తన భర్త, ఏడాదిన్నర కొడుకును బంధువుల ఇంటికి వెళ్లాలని సూచించినట్లు తెలిపింది. కానీ వారు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ తమ ఇంట్లోనే అందరం కలిసి ఉండాల్సి వచ్చిందని చెప్పింది.
ఈ సమయంలో బాబుకు భర్త పాలు పట్టిస్తే తాగలేదని, తన మీద బెంగతో చాలా ఏడ్చాడని, దీంతో తనకు కూడా హై ఫీవర్ వచ్చేసిందని వెల్లడించింది. ఫైనల్‌గా డాక్టర్ సలహాతో మాస్క్, గ్లౌజెస్ ధరించి.. భయపడతూనే బాబుకు బ్రెస్ట్ ఫీడ్ చేశానని చెప్పింది శ్వేత. ఆ సమయంలో తన ద్వారా బాబుకు కరోనా వస్తుందేమోనని భయపడిపోయాడని, అలాంటి పరిస్థితులు పగవారికి కూడా రాకూడదని దేవుడిని కోరుకున్నానని పేర్కొంది. ఆ 21 రోజులు ప్రతీ క్షణం చాలా భయపడ్డానని తెలిపిన ఆమె.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.