- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
త్వరలో ‘వకీల్‌సాబ్’ సెట్స్‌లోకి :శ్రుతి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ఇండస్ట్రీకి ‘వకీల్‌సాబ్’చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సీ కీలకపాత్రల్లో నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ శ్రుతి హాసన్ కీ రోల్‌లో కనిపించనున్నారు.
శ్రుతి తాజాగా ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఇందులో పవన్ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ చెప్పింది. 2021 జనవరిలో ‘వకీల్‌సాబ్’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది. పవన్ మూవీలో తాను భాగమైనందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం ద్వారా పవన్ సరసన మూడో సారి నటించే చాన్స్ శ్రుతిహాసన్ కొట్టేసింది. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, బోనీకపూర్ నిర్మాతలు.
Next Story