- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్‌గా కనిపిస్తున్న శ్రుతిహాసన్
దిశ, సినిమా : యాక్టింగ్, టాలెంట్‌తోనే కాదు అప్పియరెన్స్‌తోనూ ఇంప్రెషన్ కొట్టేయగల హీరోయిన్ శ్రుతిహాసన్. తెలుగు సినిమాల్లో ట్రెడిషన్ లుక్‌లో కనిపించే ఈ భామ.. తన మ్యూజికల్ బ్రాండ్ పర్ఫార్మెన్సెస్‌లో ట్రెండీ లుక్‌తోనూ అదరగొడుతుంది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో తల నుంచి కాలి వరకు పూర్తిగా బ్లాక్ కలర్‌లో దర్శనమిచ్చింది. బ్లాక్ జీన్స్‌పై బ్లాక్ బ్రాలెట్ టాప్ ధరించిన ఈ అమ్మడు.. దానిపై అదే కలర్ లెదర్ జాకెట్‌ను వేసుకుంది.
ఇక మెడలో కొన్ని సిల్వర్ చైన్స్‌తో పాటు వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని బోల్డ్ మేకప్‌తో వ్యూయర్స్ అటెన్షన్ క్యాచ్ చేస్తోంది. ల్యాష్‌అప్ చేసిన కనుబొమ్మలు, పిల్లి కళ్లకు తోడు బ్లాక్ కలర్‌లో బోల్డ్‌గా కనిపిస్తున్న లిప్స్.. తన ఔట్‌ఫిట్‌కు అసలైన అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన శ్రుతి.. ‘కొంతమంది అమ్మాయిలు మాలిబు బార్జీస్, కానీ నేను మాత్రం వెడ్నస్‌డే ఆడమ్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక శ్రుతి తెలుగు సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తుండగా.. 2022లో రిలీజ్ కానుంది.