- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘శృతి’ పాటతో వచ్చేస్తోంది
దిశ, వెబ్ డెస్క్: శ్రుతి హాసన్.. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత రవితేజకు జోడీగా ‘క్రాక్’ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. థియేటర్లు తెరుచుకున్న తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పవర్ స్టార్‌తో గబ్బర్ సింగ్, కాటమ రాయుడు చిత్రాల్లో నటించిన శృతి ‘వకీల్ సాబ్’ చిత్రంలో మరోసారి పవన్‌తో జట్టు కట్టబోతుంది. సినిమా విషయాలు పక్కన పెడితే.. శృతి మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా కూడా రాణిస్తోంది. ఇప్పటికే పలు ప్రత్యేక ఆల్బమ్స్‌లో పాటలు పాడి తన ప్రతిభను చాటింది.
శృతి మరోసారి తనలోని మ్యూజిక్ లవర్‌కు పని చెప్పింది. తాజాగా తాను ‘ఎడ్జ్’ అనే ప్రైవేట్ వీడియో సాంగ్‌ను రూపొందించింది. స్వయంగా తానే మ్యూజిక్ చేసి, పాడిన ఈ పాటను రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
‘ఎడ్జ్’ అనే ప్రైవేట్ సాంగ్‌కు.. ట్యూన్స్ తానే సమకూర్చడంతో పాటు వీడియో కూడా శ్రుతి హాసనే చేసింది. ఈ వీడియో గురించి..‘‘సంగీతం నా జీవితంలో భాగం అయినందుకు నేను అదృష్టవంతురాలిని. ఎడ్జ్ అనేది ప్రతి ఒక్కరిలోని అసంపూర్ణమైన ప్రేమను తెలియజేస్తుంది. ఈ పాట కోసం ఎంతో ఎగ్జయింట్‌గా ఎదురు చూస్తున్నాను. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటలకు విడుదలవుతోంది’ అని శృతి తెలిపింది. అంతేకాదు ‘టేక్ మీ టేక్ మీ టూ.. ’ అంటూ పది సెకన్ల పాటను ఇంట్రడ్యూస్ చేసింది.