ఆశా భోంస్లే ఎదుట.. శృతి పాట

by Shyam |   ( Updated:11 March 2020 6:05 AM  )
ఆశా భోంస్లే ఎదుట..  శృతి పాట
X

దిశ, వెబ్‌డెస్క్: శృతి హాసన్ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ తండ్రి కమల్ హాసన్‌ను గర్వపడేలానే చేసిన శృతి… అలాంటి ఒక మూవ్‌మెంట్‌ను షేర్ చేసింది. లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ముందు స్కూల్ డ్రెస్‌లో కూర్చున్న ఫొటోను పోస్ట్ చేసిన ఆమె… తన ముందు పాట పాడిన జ్ఞాపకం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపింది. ఆ రోజు పాట పాడేందుకు చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యానని పోస్ట్ పెట్టింది. ఈ బ్యూటిఫుల్ మెమొరీని గుర్తు చేసిన అభిమానికి థాంక్స్ చెప్పింది. చిన్నప్పటి నుంచే మ్యూజిక్, యాక్టింగ్ నేర్చుకున్న శృతి.. ఇప్పుడు అటు సినిమాలు ఇటు సింగింగ్‌తో అదరగొడుతుంది. ప్రస్తుతం తెలుగులో ‘క్రాక్’ మూవీలో మాస్ మహారాజ రవితేజ సరసన నటిస్తోంది శృతి.

Tags: Shruthi Hassan, Asha Bosle, Kamal Hassan, Singer

Next Story