ప్రభాస్ ‘సలార్‌’కు జోడి ఓకే?

by Shyam |
ప్రభాస్ ‘సలార్‌’కు జోడి ఓకే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వాయిలెంట్ ‘సలార్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్యే సినిమా లాంచ్ చేసిన మూవీ యూనిట్.. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉంది. దీంతో త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో నటీనటుల ఎంపిక జరుగుతుండగా.. హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ముందుగా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీని తీసుకుంటారని టాక్ వచ్చినా.. ఇప్పుడు బ్యూటిఫుల్ శ్రుతి హాసన్‌ను ఎంపిక చేశారని సమాచారం. ప్రభాస్‌ కటౌట్‌కు తగినట్లుగా ఉంటుందని.. పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను కూడా చక్కగా చేయగలదని తనవైపు మొగ్గు చూపారట మేకర్స్. పైగా ప్రభాస్-శ్రుతి జతకట్టడం ఫస్ట్ టైమ్ కాబట్టి స్క్రీన్‌పై జోడీ కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటుందని శ్రుతిని సంప్రదించారట. ప్రభాస్‌తో రొమాన్స్, కంటెంట్ ఉన్న క్యారెక్టర్, పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఇన్ని లాభాలుండటంతో శ్రుతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.

Advertisement

Next Story