- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో సారి ప్రేమలో పడ్డ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ మళ్లీ ప్రేమలో పడింది. తనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయిన భామ..ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ ఆడింది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్ మీరు ప్రజెంట్ లవ్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ట్రూ.. ఐ గెస్..అని సమాధానమిచ్చింది. మీరు మీ ఎక్స్ లవర్‌ని హేట్ చేస్తున్నారా? అని అడగ్గా..యూ ఆర్ బ్యాడ్..నేను హేట్ చేయడం లేదని చెప్పింది. ఈ ఇంటరాక్షన్ నెట్టింట వైరల్ అయింది. ఇంతకీ ఈ కొత్త ప్రేమికుడు ఎవరై ఉంటారనే చర్చ జరుగుతోంది.
శ్రుతి గతంలో లండన్‌కు చెందిన మ్యుజిషియన్ మైఖేల్ కొర్శలేతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి ముంబైలో హోటల్స్‌కు విచ్చేయడం, ఎక్కడ చూసినా జంటగా కనిపించడంతో లవ్‌లో ఉన్నారని ప్రచారం జరగ్గా.. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఇద్దరు. కానీ, కొన్ని కారణాల వల్ల తర్వాత విడిపోయారు. ‘జీవితం మా ఇద్దరినీ గ్లోబ్‌కు ఆపోజిట్ సైడ్స్‌లో ఉంచింది..కాబట్టి ఇద్దరం సోలోగానే ఎవరి దారిలో వారు నడవాల్సి వస్తుంది..కానీ, ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ మెట్‌గా ఉండిపోతుంది’ అని సోషల్ మీడియాలో బ్రేకప్ పోస్ట్ పెట్టాడు మైఖేల్. బ్రేకప్ తర్వాత కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన శ్రుతి..మళ్లీ సినిమాలు, సిరీస్‌లు, ఆల్బమ్ మేకింగ్‌తో బిజీ అయిపోయింది. సంక్రాంతికి ‘క్రాక్’తో హిట్ అందుకున్న శ్రుతి..నెట్ ఫ్లిక్స్ తెలుగు ఒరిజినల్ ‘పిట్ట కథలు’ ఆంథాలజీలో కనిపించనుంది.