అమ్మానాన్న ఎలాంటి హెల్ప్ చేయరు : శ్రుతి

by Shyam |
అమ్మానాన్న ఎలాంటి హెల్ప్ చేయరు : శ్రుతి
X

దిశ, సినిమా : తనకు కూడా ఆర్థిక పరిమితులు ఉన్నాయని అంటోంది హీరోయిన్ శ్రుతి హాసన్. మంచి లేదా చెడు ఏదైనా సరే ప్రతీ నిర్ణయం తానే తీసుకుంటానన్న బ్యూటి.. కొందరు తెలివైన వారు ముందుగానే ఆలోచించి ఈ సమయంలో కారు లేదా ఇల్లు లాంటివి కొనుగోలు చేయలేదని చెప్పింది. కానీ తాను మాత్రం ఇల్లు కొన్నానని, ఇందుకు సంబంధించిన అప్పులు తీర్చేందుకు కచ్చితంగా పనిచేయాల్సి వస్తుందని తెలిపింది.

తన బిల్లులు తానే చెల్లించుకుంటానని, అమ్మానాన్న నుంచి హెల్ప్ తీసుకోనని చెప్పింది. అందుకే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తే తప్పకుండా అటెండ్ కావాల్సి వస్తుందని, కరోనా కారణంగా భయంకర పరిస్థితులు నెలకొన్నా ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ ఫుల్ ఫిల్ చేయాల్సి ఉంటుందని వివరించింది. కాగా శ్రుతి 11 ఏళ్లుగా పేరెంట్స్‌కు దూరంగా ఒంటరిగానే ఉంటోంది.

Advertisement

Next Story

Most Viewed