మీ వల్లే ఈ స్థాయిలో ఉన్నా : శృతి

by  |
మీ వల్లే ఈ స్థాయిలో ఉన్నా : శృతి
X

దిశ, వెబ్‌డెస్క్ :
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.. అటు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ సూపర్ పాపులారిటీ సంపాదించింది. పదేళ్ల కెరియర్‌‌లో నటిగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆమె.. సంగీత ప్రపంచాన్ని కూడా ఏలేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాల్లో పలు స్టేజ్ షోస్ చేసిన శృతి.. సరికొత్తగా ఓ ఆల్బమ్ రిలీజ్ చేసింది.

నెల రోజుల క్రితం ‘ఎడ్జ్’ పేరుతో ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేసిన శృతి.. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. సినీ సెలెబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరు మెచ్చిన ఎడ్జ్‌కు ఫుల్ సపోర్ట్ లభించింది. చిన్న పిల్లలు సైతం పాటకు ఫిదా కాగా.. కవర్ సాంగ్స్‌‌తో సూపర్ సక్సెస్ అయింది. నెలరోజుల్లో 15 లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న ఎడ్జ్ ఆల్బమ్‌కు ప్రేక్షకులు అందించిన ఆదరణకు థాంక్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసింది శృతి. ఇలాంటి సపోర్ట్ లైఫ్ లాంగ్ అందించాలని కోరింది. మీ వల్లే ఇంత సక్సెస్ అందుకున్నానని.. ఈ స్థాయిలో ఉన్నానని కృతజ్ఞతలు తెలిపింది.


Next Story