క్రేజీ ఆఫర్ కొట్టేసిన శృతిహాసన్

by Jakkula Samataha |
క్రేజీ ఆఫర్ కొట్టేసిన శృతిహాసన్
X

శృతి హాసన్ తన తండ్రి కమలహాసన్ వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా ప్రశంసలు అందుకుంటుంది. మ్యూజిక్ షోస్ తో కొన్నాళ్లపాటు సినిమాలను దూరం పెట్టిన ఈ అందాల బొమ్మ మళ్లీ వరుస సినిమాలు చేస్తోంది.

తెలుగులో చాలాకాలం తర్వాత రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తోంది శృతి. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఆమెను పలకరించబోతోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో శృతినే ప్రిఫర్ చేస్తున్నాడట హరీశ్. గబ్బర్‌సింగ్‌లో పవన్‌తో జోడీకట్టిన శృతి కాటమరాయుడులోనూ రెండోసారి పవన్‌తో కలిసి చేసింది. అందుకే ముచ్చటగా మూడోసారి సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట డైరెక్టర్. పవన్ హీరోయిన్‌గా శృతిని సెట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. మైత్రీ మూవీ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed