Shruti Haasan: వింతగా ఉంది.. కానీ తప్పదంటోన్న శ్రుతి

by Jakkula Samataha |   ( Updated:2021-05-22 09:02:15.0  )
Shruti Haasan: వింతగా ఉంది.. కానీ తప్పదంటోన్న శ్రుతి
X

దిశ, సినిమా : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ శ్రుతి హాసన్ ప్రస్తుతం తమిళ, తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. పాండెమిక్‌ టైమ్‌లోనూ టాలీవుడ్‌లో ‘కిక్’ ద్వారా హిట్ అందుకున్న భామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లోనూ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేసి మెప్పించింది. ప్రభాస్‌తో ‘సలార్’ కమిట్ అయిన భామ.. షూటింగ్‌లో పాల్గొనగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. అంతేకాదు పలు సిరీస్‌ల్లోనూ నటిస్తున్న శ్రుతి.. ఈ ప్రాజెక్ట్‌ల కోసం ఇంటి నుంచి వర్క్ చేస్తున్నట్లు తెలిపింది.

హోమ్‌నే డబ్బింగ్ స్టూడియోగా మార్చేసినట్లు తెలిపిన ఆమె.. కొవిడ్ స్ట్రేంజ్ టైమ్స్‌లో ఇదంతా తప్పదని అంటోంది. ‘నా ఆరోగ్యం, భద్రత కోసం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం ఎప్పటికీ మర్చిపోను. ప్రతీ రోజు ప్రతీ ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను – చీకటి కాలం నడుస్తుంది కానీ మనం ఎంచుకుంటే వెలుగులో, బలంతో ఉండగలం! దయచేసి సురక్షితంగా ఉండండి. వీలైతే వ్యాక్సిన్ వేయించుకోండి’ అని సూచించింది.

Advertisement

Next Story