రజినీ, కమల్ మూవీ రీమేక్.. ఆలోచన శృతిదేనట !

by Shyam |
రజినీ, కమల్ మూవీ రీమేక్.. ఆలోచన శృతిదేనట !
X

సూపర్ స్టార్స్ రజినీ కాంత్, కమల్ హాసన్ నటించిన ‘అవల్ అప్పడిదాన్’ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. 1978లో కమల్ హాసన్, శ్రీప్రియ జోడీగా నటించిన ఈ చిత్రంలో రజినీ కీలక పాత్రలో కనిపించారు. కాగా ఈ సినిమాను ప్రస్తుతం డైరెక్టర్ బద్రీ వెంకటేశ్ రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ పాత్రలో శింబు, కమల్ హాసన్ క్యారెక్టర్‌లో దుల్కర్ సల్మాన్ నటించనుండగా హీరోయిన్ శ్రీ ప్రియ పాత్రలో శృతిహాసన్‌ను తీసుకోవాలని అనుకున్నారట. తన ఫ్రెండ్ శృతితో కలిసి చర్చించిన దర్శకుడు ఈ సినిమా చేస్తే బాగుంటుందని నిర్ణయించారట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందంటున్న దర్శకుడు తను ఇప్పటివరకు కమిట్ అయిన ప్రాజెక్ట్‌లు కంప్లీట్ కాగానే ఈ సినిమా మొదలుపెడతానని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed