శ్రీరామ్ గ్రూప్ అనుబంధ సంస్థల విలీనం!

by Harish |
shriram
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్ గ్రూప్ తన మూడు అనుబంధ కంపెనీలను విలీనం చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విలీనం ద్వారా దేశంలోనే అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)గా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిలిచింది. ఈ నేపథ్యమ్ళో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, ప్రమోటర్‌గా ఉన్న శ్రీరామ్ కేపిటల్ కంపెనీల బోర్డులు ఈ విలీనానికి ఆమోదం తెలిపిందిన సంస్థ వెల్లడించింది.

అంతేకాకుండా ఈ విలీనం ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ సంస్థగా మారనుంది. అదేవిధంగా సంస్థ రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగిన కంపెనీగా ఉండనుంది. ఇక రానున్న రోజుల్లో ఈ విలీనానికి రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం లభించాల్సి ఉంది. సంస్థలో మొత్తం 50,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. శ్రీరామ్ గ్రూప్ అనుబంధ సంస్థల విలీనం నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లలో శ్రీరామ్ సిటీ షేర్ ధర 10.5 శాతం పుంజుకోగా, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ షేర్ ధర 6.5 శాతం క్షీణించింది.

Advertisement

Next Story

Most Viewed