- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెజీషియన్ అవతారమెత్తిన ‘అయ్యర్’
కరోనా ప్రభావంతో అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్‌లు రద్దు కావడంతో క్రికెటర్లందరూ స్వీయ నిర్బంధం (సెల్ఫ్ క్వారంటైన్)లోకి వెళ్లిపోయారు. ఎప్పుడూ అత్యంత బిజీగా ఉండే క్రికెటర్లకు ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చోడం అంటే కాస్త కష్టమైన పనే. కానీ ఇంట్లో బోర్ కొట్టకుండా.. ఒక్కో క్రికెటర్ ఒక్కో పని చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. కాగా, అతను తనకు తెలిసిన ట్రిక్స్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. ఇంట్లోనే కార్డ్ ట్రిక్ షో చేస్తూ మెజీషియన్‌గా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘ఈ కార్డ్ ట్రిక్ ద్వారా అందరికీ నవ్వులు తెప్పించావు.. థాంక్యూ ఛాంపియన్’ అంటూ బీసీసీఐ వ్యాఖ్యానించింది.
మరోవైపు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. కొద్ది సేపు బంతిని బ్యాట్‌తో కొడుతూ, పుస్తకాలు చదువుతూ, ఐపాడ్‌లో పని చేసుకుంటూ ఇలా రకరకాలుగా టైమ్ పాస్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Tags : Shreyas Iyer, BCCI, Self Quarantine, Rahul Dravid, Magician