జీరో సైజ్ అవసరమా..? : నటి

by Jakkula Samataha |
shrenu-parik
X

దిశ, సినిమా : యాక్ట్రెస్ శ్రేణు పారిఖ్ ప్రజలు సైజ్ జీరో ఫ్రేమ్స్‌కు స్టిక్ అయిపోకూడదని సూచించింది. మనకున్న శరీరంతో హ్యాపీగా జీవించాలన్న ఆమె.. శరీరాన్ని ఓ ఆలయంగా అభివర్ణించింది. మన బాడీని చాలా శ్రద్ధగా చూసుకోవాలని సూచించిన నటి.. ఆహారం, వ్యాయామంపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పింది. పొట్టి, లావు, వంకర మొఖం ఇలా ఎన్ని కామెంట్స్ చేసినా తాను పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేశానని.. అందరూ కూడా అలాగే ఉండాలని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు సైతం బాడీ పాజిటివ్ పోస్టులను ఎంకరేజ్ చేస్తున్నారని, జీరో సైజ్ అవసరాలు లేవని అభిప్రాయపడింది. మన సొంత శరీరాలతో సంతోషంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్న నటి.. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆరోగ్యం గురించి ప్రాముఖ్యతను వివరించింది. ప్రాజెక్ట్‌ల కోసం బరువు తగ్గడం, పెరగడం చేయొచ్చు కానీ పాండమిక్ తర్వాత హెల్తీనెస్ ఎంత ఇంపార్టెంటో అర్థమైందని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed