- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటును అమ్ముకోవద్దు: దాసోజు శ్రవణ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాన్ని పెట్టుబడి వ్యాపారంగా మార్చారని, ఇప్పటికే సంతలో గొడ్లను కొన్నట్టుగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందేనన్నారు. తాజాగా పట్టభద్రుల మండలి ఎన్నికల్లో విద్యార్థి, నిరుద్యోగ, గ్రాడ్యుయేట్లను కూడా కొనేందుకు టీఆర్‌ఎస్ నేతలు వస్తున్నారని, ఐదు, పదివేలకు ఓట్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్లకు చేతులెత్తి మొక్కుతున్నామని, చదువుకున్నవాళ్లు, ఆలోచనా శక్తి, వివేకం, విజ్ఞత ఉన్న గ్రాడ్యుయేట్లు టీఆర్‌ఎస్ నేతల పెట్టబడి రాజకీయాలను గుర్తించాలని, ప్రజాస్వామ్యంలో ఆయుధమైన ఓటును అమ్ముకోవద్దన్నారు. ఓటును అమ్ముకుంటే ఆత్మను అమ్ముకున్నట్టేనని, భవిష్యత్తుతో పాటు భవిష్యత్తు తరాలను నాశనం చేసే ప్రజాస్వామిక విలువను చిద్రం చేసినట్లేనని శ్రవణ్ పేర్కొన్నారు.
ఓటు వినియోగించుకోవడంలో నిజాయితీని కోల్పోతే నిలదీసే హక్కును కూడా కోల్పోతామని, ఆత్మసాక్షిగా ఓటేయాలని, ఆత్మను అమ్ముకుని ఓటేయవద్దని ప్రాధేయపడ్డారు. శనివారం ఓటుకు డబ్బలుు ఇస్తామంటూ టీఆర్ఎస్ఎమ్మెల్యే రాములు బహిరంగంగా ప్రకటించారని, వేలకు వేలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చెప్పుతున్నారన్నారు. విందులు, వినోదాలతో పాటుగా దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాప్రతినిధులను ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని అంశాల్లో నిలదీస్తే హక్కును కోల్పోవద్దని శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.