సుష్.. ప్రకాశిస్తూనే ఉంటావ్ : శ్రద్ధ

by Shyam |
సుష్.. ప్రకాశిస్తూనే ఉంటావ్ : శ్రద్ధ
X

ఏం జరిగిందో అంగీకరించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది సాహో భామ శ్రద్ధా కపూర్. ‘చుట్టూ భారీ శూన్యత కనిపిస్తుంది సుష్..’ అంటూ తన స్నేహితుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి ఉద్వేగానికి లోనైంది. ‘వినయం, తెలివితేటలు, ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలనే ఉత్సాహం, ప్రతిచోటా, ప్రతీ విషయంలో అందాన్ని, ఆనందాన్ని చూసే సుష్.. ప్రతిభ ఉన్న నటుడు మాత్రమే కాదు, అంతకు మించిన అద్భుతమైన వ్యక్తి’ అని తెలిపింది. తన నవ్వు, తనతో షేర్ చేసుకున్న మూమెంట్స్ మ్యాజికల్‌గా ఉండేవని చెప్పింది శ్రద్ధ.

తన ఇల్లు ప్రకృతితో మమేకమై ఉందని చెప్పిన ఆమె.. ‘చిచ్చోరే’ టీమ్ సుశాంత్ ఇంటికి వెళ్లినప్పుడు ప్రకృతితో కలిసిన ప్రశాంతత చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యామంది. టెలిస్కోప్ ద్వారా సుశాంత్ తనకు చంద్రుణ్ణి చూపించినప్పుడు.. గొప్ప అనుభూతికి పొందానని.. దాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. కాలిడో స్కోప్ ద్వారా ఎన్నో విషయాలను చూసిన తను.. ఆ విషయాలను ప్రతీ ఒక్కరితో పంచుకోవాలని ఆరాటపడే వాడని చెప్పింది. ‘చాలా సరళమైన విషయాలకు మెస్మరైజ్ అయ్యేవాడని.. గొప్ప దయగల వ్యక్తి’ అని తెలిపింది. ‘మిస్ యూ సుశాంత్.. నువ్వు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటావ్’ అంటూ తనకు సుశాంత్ గిఫ్ట్‌గా ఇచ్చిన పుస్తకాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

https://www.instagram.com/p/CBkuidCpXQh/?igshid=avutzqy43htf

Advertisement

Next Story

Most Viewed