సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం

by Sumithra |   ( Updated:2020-11-16 04:41:38.0  )
సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జహీరాబాద్ మండలం గోవిందాపూర్‌లో 30ఎకరాల భూ వివాదంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇదేక్రమంలో ఓ వర్గంపై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన మరోవర్గం వారు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story